![]() |
![]() |

స్టార్ మా టీవీ సీరియళ్ళలో అత్యధిక టీఆర్పీ పొందుతున్న సీరియల్ గా 'బ్రహ్మముడి' నిలిచింది. రెండవ స్థానంలో 'నాగపంచమి', మూడవ స్థానంలో 'కృష్ణ ముకుంద మురారి' ఉండగా.. నాల్గవ స్థానంలో 'నువ్వు నేను ప్రేమ' ఉంది. ఆ తర్వాత అయిదవ స్థానంలో కొత్త సీరియల్ 'గుండెనిండా గుడిగంటలు' ఉంది.
గత కొన్ని నెలలుగా స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్ లో 'బ్రహ్మముడి' అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తుంది. దీనికి కారణం కథ బాగుండటం ఒకటైతే.. ఆన్ స్క్రీన్ పై రాజ్-కావ్యల మధ్య బాండింగ్ ఉంది. అలాగే దుగ్గిరాల ఇంట్లో సాగే ఎమోషనల్ సీక్వెన్స్ సీన్స్, అక్కచెల్లెళ్ళ మధ్య సాగే గొడవలు.. ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి. కనకం, కృష్ణమూర్తిల మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్.. తెలుగింటి ప్రేక్షకులకు దగ్గరగా ఉంది. బొమ్మలకి రంగులు వేసుకుంటూ కృష్ణమూర్తి కనకం ఇద్దరు తమ ఇద్దరు కూతుళ్ళు కావ్య, స్వప్నలని చదివించి దుగ్గిరాల ఇంటి కోడళ్ళుగా చేశారు. కావ్యని దుగ్గిరాల ఇంట్లో మొదట అందరు ద్వేషించేచారు. ఇక కొన్ని ఎపిసోడ్ ల ముందు వరకు కావ్యని ధాన్యలక్ష్మీ, ఇందిరాదేవీ, సీతారామయ్య, సుభాష్, కళ్యాణ్ లు ఇష్టపడగా.. తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లలో అనామిక-కళ్యాణ్ ల పెళ్ళి జరిగింది. ఇక ఒక ప్లాన్ ప్రకారం దుగ్గిరాల ఇంట్లోకి అడుగుపెట్టిన అనామిక.. కావ్య మీద ఇంట్లోని వాళ్ళందరికి ఉన్న మంచి అభిప్రాయం పోగొట్టి తను మంచి కోడలిని అనిపించుకోవాలని తాపత్రయపడుతుంది. ఇక రాహుల్ వాళ్ళ అమ్మ రుద్రాణి ఇదే మంచి ఛాన్స్ అని భావించి అనామికని తనవైపు తిప్పుకుంది.
ఇంట్లో కవితలు రాసుకుంటూ కూర్చుండే కళ్యాణ్ ని చూసిన తన భార్య అనామికకి నచ్చట్లేదు. ఆ విషయాన్ని అత్త ధాన్యలక్ష్మీతో చెప్పింది. అదే విషయాన్ని అపర్ణతో ధాన్యలక్ష్మి చెప్పింది. అధికారమంతా రాజ్ చేతిలో ఉంటే నా కొడుకు ఏం చేస్తాడు? వాడికి ఆపీస్ భాద్యతలు అప్పగించమని అక్క అపర్ణకి మొదటిసారి ధాన్యలక్ష్మీ ఎదురుతిరిగింది. ఇదంతా విని ఇంట్లో వాళ్ళంతా షాక్ అయ్యారు. అసలేం జరుగుతుంది.. ఎన్నడు అపర్ణని చూసి ఒక్క మాట కూడా మాట్లాడని ధాన్యలక్ష్మి ఇలా అడిగిందేంటని అందరు అనుకుంటుండగా ఎపిసోడ్ ముగిసింది. మరి ఆ తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటిని పెంచారు మేకర్స్. ఇలా ఈ సీరియల్ కథ మిగతా సీరియల్స్ కంటే భిన్నంగా ఉండటంతో అత్యధిక టీఆర్పీ పొందుతుంది.
![]() |
![]() |